Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోషల్ మీడియా ద్వారా ఫ్యామిలీని పరిచయం చేస్తూ ఫొటో పోస్ట్ చేసిన యాంకర్ రవి

  • యాంకర్ రవిపై పుకార్లు 
  • పెళ్లి విషయంలో ప్రచారాలు
  • సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫోటో        
బుల్లితెరపై సందడి చేస్తూ యాంకర్ రవి గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెరపై తన జోష్ చూపించే రవి .. ముక్కు సూటిగా మాట్లాడేస్తూ ఉంటాడు. తనకి ఎదురయ్యే ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడంలోనూ ఆయన అదే పద్ధతిని పాటిస్తుంటాడు. ఒకరిద్దరు యాంకర్లతో ఆయనకి సంబంధం ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇక ఆయనకి పెళ్లి అయిందని కొంతమంది .. కాలేదని కొంతమంది చెప్పుకుంటున్నారు.

ఏది నిజమో .. ఏది నమ్మాలో తెలియని పరిస్థితుల్లో, భార్యాబిడ్డలను పరిచయం చేస్తూ రవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 'సక్సెస్ ఫుల్ మేన్ కంటే ఫ్యామిలీ మేన్ చాలా హ్యాపీగా ఉంటాడు. నా భార్య 'నిత్య' .. నా మూడేళ్ల కూతురు 'వియా' అంటూ చర్చి నుంచి తాము బయటికి వస్తోన్న పిక్ ను షేర్ చేశాడు. 'కంగ్రాట్స్ .. బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోవద్దు .. లైఫ్ ను ఎంజాయ్ చేయి .. ఫ్యామిలీతో కలిసి నువ్వు ఇచ్చే మొదటి ఇంటర్వ్యూ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాము' అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 
ravi
nithya
viya

More Telugu News